Thursday, January 23, 2025

‘ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా గిల్..

- Advertisement -
- Advertisement -

దుబాయి: ఇటీవలె క్రికెట్లో పరుగుల వర్షం కురిపించిన టీమిండియా సంచలనం శుభ్‌మన్ గిల్ జనవరి నెలకు గానూ పురుషుల విభాగంలో ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచాడు. జనవరిలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గిల్ రికార్డులు బద్దలు కొట్టాడు. శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్‌లలో సెంచరీల మీద సెంచరీలు చేశాడు. 23 ఏళ్ల గిల్ జనవరిలో ఏకంగా మూడు సెంచరీలు బాదేశాడు.

అంతేకాదు ఈ కాలంలో ఏకంగా 567 పరుగులు బాదేశాడు. ఇక హైదరాబాద్(ఉప్పల్)లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. కేవలం 149 బంతుల్లో 28 బౌండరీల సహాయంతో 208 పరుగులు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News