Sunday, January 19, 2025

టెస్టు క్రికెట్‌లో దూకుడు పనికిరాదు గిల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టెస్టు క్రికెట్‌లో శుభ్‌మన్ గిల్ దూకుడు తగ్గించుకోవాలని టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ సూచించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత ఓపెనర్ గిల్ 2, 26 పరుగులు చేశాడు. గిల్ దూకుడుగా ఆడడంతోనే వికెట్ పారేసుకుంటున్నాడని హెచ్చరించారు. టి20, వన్డేలతో పొల్చుకుంటే టెస్టు క్రికెట్ కాస్త భిన్నంగా ఉంటుందని సలహా ఇచ్చాడు. వైట్ బాల్‌తో పోలిస్తే రెడ్ బాల్ కదలిక ఎక్కువగా ఉండడంతో పాటు బౌన్స్ అవుతుందని చెప్పారు. గిల్ కెరీర్ మంచిగా ప్రారంభించారని కొనియాడారు. ఇప్పుడు ఫామ్‌లేక ఇబ్బంది పడుతున్నాడని, తిరిగి ఫామ్‌లోకి రావాలని ఆశిస్తున్నానన్నారు. క్రీజులో ఎక్కువ సేపు ఉండటానికి ప్రయత్నించాలని గావస్కర్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News