Sunday, January 19, 2025

రోడ్‌ సైడ్ మటన్‌షాప్‌ల మూత.. బిజెపి ఎమ్మెల్యే ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

జైపూర్ : వీధులలో ఉండే అన్ని రకాల మాంసాహార దుకాణాలను వెంటనే మూసివేయాలని బిజెపి ఎమ్మెల్యే బాల్‌ముఖుంద్ ఆచార్య ఆదేశించారు. ఆచార్య ఇటీవలి రాజస్థాన్ ఎన్నికలలో జైపూర్‌లోని హవా మహల్ సీటు నుంచి గెలిచారు. తమ నియోజకవర్గంలో స్ట్రీట్ మీట్ షాపులపై దృష్టి సారించారు. వెంటనే వీటికి తాళాలు పడాల్సిందేనని ఆదేశించారు. రోడ్లపై ఎక్కడ కూడా నాన్ వెజ్ హోటల్స్ కానీ స్టాల్స్ కానీ కనబడటానికి వీల్లేదని, వీటిని వెంటనే మూసివేయాల్సి ఉందని , విజయం దక్కించుకుని 24 గంటలు కాకముందే ఈ కొత్త ఎమ్మెల్యే ఆదేశాలు వెలువరించడం సంచలనం అయింది. వీటిని మూసివేయించి, సంబంధిత ఫోటోలను తనకు వాట్సాప్ ద్వారా పంపించాలని ఆచార్య సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News