కొలంబో: శ్రీలంకలో చమురు నిల్వలు వేగంగా పడిపోతుండటంతో వాటిని ఆదా చేసేందుకు ప్రభుత్వం అత్యవసరం కాని సేవలను సోమవారం నుంచి రెండు వారాలు నిలిపివేసింది. దీనిలో భాగంగా పాఠశాలలు కూడా మూత పడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రపు సిబ్బందితో పనిచేస్తున్నాయి. ఆస్పత్రులు, కొలంబో నౌకాశ్రయం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. ఇక పెట్రోల్ పంపుల వద్ద వాహనాలు కిలో మీటర్ల పొడవునా బారులు తీరాయి. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంపై ఆందోళనలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు.
తాజాగా అక్కడ అధ్యక్ష సచివాలయ కీలక ద్వారాలను ఆందోళనకారులు చుట్టుముట్టారు. అధ్యక్షుడు గొటబాయా రాజపక్సా రాజీనామా చేయాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 9నుంచి ప్రధాన ద్వారాన్ని ఆందోళనకారులు దిగ్బంధించారు. ఆదివారం రాత్రి ఆందోళనకారులు రెండు ఎంట్రీ పాయింట్లను ముట్టడించడంతో దాదాపు 21మందిని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు.
Shut down for two week in Sri Lanka