Saturday, January 18, 2025

242 పరుగులతో రికార్డు… ఇంతకు ఎవరామె?

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: దేశీవాళీ క్రికెట్‌లో ఓ యువతి డబుల్ సెంచరీతో రికార్డు సృష్టించింది. బ్యాటింగ్‌తో తుఫాన్ సృష్టించింది. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించింది. నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ శ్వేతా సెహ్రావత్ 150 బంతుల్లో 31 ఫోర్లు, 7 సిక్స్‌లతో 242 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. లిస్ట్-ఎ క్రికెట్‌లో ద్విశతకం సాధించిన తొలి మహిళ క్రికెటర్‌గా రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. దేశీవాళీ మూడు ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా తన పేరును లిఖించుకుంది.
ఢిల్లీ జట్టు నుంచి 20 ఏళ్ల శ్వేతా సెహ్రావత్ క్రికెట్ ఆడుతుంది. అండర్-19 మహిళల టి 20 వరల్డ్ కప్ ఛాంపియన్స్‌గా నిలవడంతో భారత జట్టుకు వైఎస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోర్నీ మెంటులో అత్యధిక పరుగులు ఆమె చేసింది. 2023 డబ్ల్యుపిఎల్ వేలంలో రూ.40 లక్షలకు యుపి జట్టు ఆమెను తీసుకుంది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడి 34 పరుగులు చేసి నిరాశ పరిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News