Wednesday, January 22, 2025

బుల్లి బాయ్ కేసు: నిందితులకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్

- Advertisement -
- Advertisement -

Shweta Singh, Mayank Rawat sent to 14-day judicial custody

ముంబై: దేశంలో బుల్లి బాయ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులైన శ్వేత సింగ్(18), మయాంక్ రావత్(20)లకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తు బాంద్రా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిని జనవరి 28 వరకు పోలీసులు విచారించనున్నారు. కాగా, దీనిపై నిందితుల తరపు న్యాయవాది ఇప్పటికే బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై జనవరి (17) సోమవారం విచారణ జరగనుంది. బుల్లిబాయ్ యాప్ కేసులో ప్రధాన నిందితుడైన నీరజ్ బిష్ణోయ్‌తో పాటు శ్వేత, మయాంక్‌లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, నిందితుల తరపు న్యాయవాది, తమ క్లయింట్‌ల ట్విటర్ ఖాతాను హ్యక్ చేశారని కావాలని ఇరికించారని తెలిపారు. ఇప్పటికే శ్వేత, మయాంక్‌లను ఉత్తరాఖండ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరో నిందితుడు విశాల్ కుమార్‌ను బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. విశాల్‌కు కోవిడ్ పాజిటివ్ తేలడంతో అతడిని ముంబైలోని కలీనా క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. కాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న నీరజ్‌ను భోపాల్‌లోని వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇతడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వీరి విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పదిహేను సంవత్సరాల వయసులోనే హ్యకింగ్ నేర్చుకున్నట్లు తెలిపాడు. ఈ బుల్లి బాయ్ యాప్‌తో మహిళలను మార్ఫింగ్ చేసిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News