Monday, December 23, 2024

ప్రభాస్ పెళ్లిపై శ్యామలా దేవి వ్యాఖ్యలు వైరల్

- Advertisement -
- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ, కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ప్రభస్ పెళ్లిపై మాట్లాడిన ఆమె.. ‘బాహుబలి తర్వాత ప్రభాస్‌కు మరో విజయం దక్కడం కష్టమన్నారు. కానీ ఇప్పుడు కల్కితో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ విజయాన్ని అందుకున్నారు. అలాగే ఆయన పెళ్లి విషయంలోనూ ఇదే జరుగుతుంది. ప్రభాస్ చాలా గొప్ప వ్యక్తి. తనకు పెళ్లి చేయాలని మాకూ ఉంటుంది. ఆ సమయం రాగానే వివాహం జరిగి తీరుతుంది’ అని చెప్పారు.

కాగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాప్ నటించిన కల్కి చిత్రం.. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. రికార్డు కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతోంది. విడుదలైన 10 రోజుల్లోనే ఈ మూవీ రూ.800 కోట్లకు పైగా వసూల్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. త్వరలోనే ఈ సినిమా రూ.1000 కోట్ల మార్క్ దాటుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News