Friday, December 20, 2024

రేపు ఎస్‌ఐ, ఏఎస్‌ఐ తుది పరీక్ష ప్రిలిమినరీ ’కీ’ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల నియామకాల్లో భాగంగా నిర్వహించిన ఎస్‌ఐ, ఏఎస్‌ఎస్ తుది పరీక్షల ప్రిలిమినరీ కీ విడుదల కానుంది. ఈమేరకు పోలీసు నియామక బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు మే 10న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిలిమినరీ ఆన్సర్ ’కీ’ మే 11న వెల్లడించనున్నట్లు తెలిపారు. టిఎస్‌ఎల్‌పిఆర్‌బి అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే మే 14న సాయంత్రం 5 గంటల వరకు తెలపవచ్చు.

అయితే ప్రశ్న, దానికి సంబంధించిన జవాబు ఆధారాలను నిర్ణీత నమూనాలో సమర్పించాలని సూచించారు. ఏఎస్‌ఐ ఎఫ్‌పీబీ, ఎస్‌ఐ ఐటీ అండ్ సీఓ టెక్నికల్ పేపర్ల (ఆబ్జెక్టివ్ టైప్) తుది పరీక్షలను మార్చి 11న, ఎస్‌ఐ పీటీవో పరీక్షను మార్చి 26న, అరిథ్‌మెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ పేపర్లను ఏర్పిల్ 8న, జనరల్ స్టడీస్ పేపర్ల ఫైనల్ ఎగ్జామ్‌ను ఏప్రిల్ 9న నిర్వహించిన విషయం విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News