Monday, January 20, 2025

సహజీవనం… ఎస్ఐ, కానిస్టేబుల్ సస్పెండ్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: పరాయి స్త్రీతో సహజీవనం చేస్తున ఎస్‌ఐతో పాటు ఓ కానిస్టేబుల్ సస్పెండ్ చేసిన సంఘటన సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో జరిగింది. పోలీసులు తలెఇపిన వివరాల ప్రకారం… సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో కొమురవెళ్లివలో ఎం నాగరాజు అనే వ్యక్తి ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్‌లో శ్రీనివాస్ అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎస్‌ఐ నాగరాజు, కానిస్టేబుల్ శ్రీనివాస్ తన భార్యలకు విడాకులు ఇవ్వకుండా ఇతర మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఎస్‌ఐ నాగరాజు భార్య ఏకంగా తన పిల్లలతో కలిసి కొమురవెల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సిద్దిపేట పోలీస్ కమిషనర్ విచారణ జరిపించారు. ఆరోపణలు నిజం కావడంతో ఎస్‌ఐ నాగరాజు, కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తున్నట్లుగా మల్జీ జోన్ ఐజి 1 ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News