Thursday, December 26, 2024

వివాహేతర సంబంధం!.. చెరువులోకి దూకి ఎస్ఐ, లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్య..

- Advertisement -
చెరువులోకి దూకి ఎస్ఐ, లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదం సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. భిక్కనూరు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సాయికుమార్, బీబీపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శృతి, బీబీపేటలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నిఖిల్ లు సదాశివనగర్ మండలం, అడ్లూర్‌లో ఎల్లారెడ్డి పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చెరువు కట్టపై ఎస్ఐ సాయికుమార్ పర్సనల్ కారు, పాదరక్షలు.. శృతి, నిఖిల్ మొబైల్ ఫోన్లు లభ్యం కావడంతో గజ ఈతగాళ్లతో ముగ్గురి కోసం చెరువులో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు.
ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని ఎస్పీ సింధు శర్మ పరిశీలించారు. కానిస్టేబుల్ శృతితో ఎస్ఐ వివాహేతర సంబంధంతోనే ఈ ఆత్మహత్యలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిఖిల్ ఎస్ఐకి, కానిస్టేబుల్ శృతికి మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లుగా అనుమానిస్తున్న పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐకి పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉండగా.. శృతికి పెళ్ళై విడాకులు అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News