Thursday, January 23, 2025

మద్యం మత్తులో ఎస్‌ఐ వీరంగం…. బ్లూకోర్టు సిబ్బందిపై దాడి

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/ మంచిర్యాల న్యూస్: మద్యం మత్తులో ఓ ఎస్‌ఐ వీరంగం సృష్టించిన సంఘటన మంచిర్యాల జిల్లాలో మండలంలో జరిగింది. మంచిర్యాల ఐబి చౌరస్తాలో ఎస్‌ఐ తిరుపతి తన స్నేహితులతో కలిసి అర్థరాత్రి నడిరోడ్డుపై మద్యం సేవించడంతో హంగామా సృష్టించారు. బెజ్జంకిలో ఎస్‌ఐగా తిరుపతి విధులు నిర్వహిస్తున్నారు. స్థానికులు 100కు డయల్ చేయడంతో బ్లూకోర్టు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎస్‌ఐ తిరుపతి, అతడి స్నేహితులు బ్లూకోర్టు సిబ్బందిపై దాడి చేశారు. పోలీసులపై దాడిని స్థానికులు అడ్డుకోవడంతో ఎస్‌ఐ కారు వదిలి పారిపోయాడు. ఎస్‌ఐ స్వగ్రామం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామంలో జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News