Sunday, December 22, 2024

ఖాకీ కావరం…. తల దువ్వితే గుండు చేయించిన ఎస్ఐ

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. తన ముందు తల దువ్వాడని ముగ్గురు యువకులకు లింగాల ఎస్ఐ జగన్ మోహన్ శిరోముండనం చేశాడు. మనస్థాపంతో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే యువకుడిని నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ అతడు చికిత్స పొందుతున్నాడు. యువకుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పెట్రోల్ బంకులో పెట్రోల్ నాణ్యత విషయంలో యువకులు, సిబ్బంది మధ్య ఘర్షణ జరగడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు అక్కడికి చేరుకొని ముగ్గురు యువకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముగ్గురు యువకుల్లో ఒకడు ఎస్సై జగన్ ముందు నిల్చోని తల దువ్వడంతో ఆగ్రహంతో రగిలిపోయాడు. దీంతో ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించారు. ఎస్ఐ పై చర్యలు తీసుకోవాలని యువకుడి బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కోసారి పోలీసులు అతి క్రూరంగా ప్రవర్తిస్తున్నారని నెటిజన్లు వాపోతున్నారు. నేరస్తులపై పోలీసులు ప్రతాపం చూపించాలని కానీ అమాయకులపై కాదని నెటిజన్లు వాపోతున్నారు. పోలీసుల చేతిలో అమాయకులు బలి కావడం సమాజానికి మంచిది కాదని మేధావులు హితువు పలుకుతున్నారు.

.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News