మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ఇటీవల నిర్వహించిన ఎస్త్స్ర, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈమేరకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఫలితాలను వెల్లడించింది. ఫలితాలు బోర్డు వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. సివిల్ ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో 46.80 శాతం మంది అభ్యర్థులు రెండో దశకు క్వాలిఫై అయ్యారు. సివిల్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలో 31.40 శాతం మంది ఫిజికల్ టెస్టులకు క్వాలిఫై అయ్యారు. అలాగే రవాణా కానిస్టేబుల్ పరీక్షలో 44.84 శాతం, ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షలో 43.65 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. 554 ఎస్‌ఐ పోస్టులకు ఆగస్టు 7వ తేదీన రాత పరీక్ష నిర్వహించారు. 15,644 కానిస్టేబుల్, 63 ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్, 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ పోస్టులకు ఆగస్టు 28న రాత పరీక్ష నిర్వహించిన విషయం విదితమే. ఎస్‌ఐ పోస్టులకు 2,25,668 మంది అభ్యర్థులు హాజరు కాగా, సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు 5,88,891 మంది రాత పరీక్షలు రాశారు.