Monday, December 23, 2024

పోలీస్ స్టేషన్‌లో బాల్కనీ నుంచి కిందపడి ఎస్‌ఐ మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: పోలీస్ స్టేషన్ బాల్కనీ నుంచి కిందపడి ఎస్‌ఐ మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఎత్మాగూడ పోలీస్ స్టేషన్‌లో కుల్దీప్ కుమార్ తీవారీ(50) అనే పోలీస్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం సాయంత్ర విధులు ముగిసిన తరువాత బరాక్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాడు. పోలీస్ స్టేషన్‌లోని బాల్కనీ నుంచి బరాక్‌లోకి వెళ్తుండగా కాలి జారి కిందపడిపోయాడు. వెంటనే ఎస్‌ఐని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఎస్‌ఐ కన్నుమూశాడు. పోలీస్ ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కుల్దీప్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుల్దీప్ భార్య వనిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News