Wednesday, January 22, 2025

రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం పోలీస్‌స్టేషన్‌లో రెండవ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న ఇంద్రన్న రోడ్డు ప్రమాదంలో మరణించిన సంఘటన ఏటూరునాగారం, కమలాపురం రహదారి మధ్యలో జీడి వాగు వద్ద మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విధి నిర్వహణలో భాగంగా ఏటూరునాగారం రెండవ ఎస్‌ఐ ఇంద్రయ్య ప్రయాణిస్తున్న పోలీసు వాహనం అదుపు తప్పి జీడి వాగు వద్ద పల్టి కొట్టడంతో డ్రైవర్‌తో పాటు ఎస్‌ఐ మరణించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. వాహనంలో ఉన్న మరో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలవ్వడంతో అతన్ని వెంటనే ఏటూరునాగారం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సంఘటన స్థలాన్ని ములుగు జిల్లా ఎస్‌పి గౌస్ ఆలం, సిఐ మండల రాజులు పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News