Monday, January 20, 2025

రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ దుర్మరణం

- Advertisement -
- Advertisement -

SI died in road accident

విధుల్లో చేరేందుకు తండ్రి ఆటోలో వికారాబాద్ వస్తుండగా ఢీ కొట్టిన బస్సు, అక్కడికక్కడే ఇద్దరు మృతి, వారం క్రితమే ఎస్‌ఐ శ్రీనునాయక్ వివాహం, కుటుంబంలో తీరని విషాదం
నల్లగొండ జిల్లా పోలేపల్లి రాంనగర్ వద్ద ఘటన

మనతెలంగాణ/ కొండమల్లేపల్లి( చింతపల్లి) : నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని పోలేపల్లి రాంనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ వెంకటేశ్వర్లు,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండల పరిధిలోని అందుగుల గ్రామపంచాయతీలోని మాన్యతండాకు చెంది న నేనావత్ మాన్యనాయక్ (55), నేనావత్ శ్రీనునాయక్(33)అక్కడి అక్కడే మృతి చెందారు. మాన్యనాయక్ తండా కు చెందిన నేనావత్ మాన్యనాయక్‌కు సొంత అటోతో జీవనోపాధి సాగిస్తూ తమ కుమారుల ఉన్నత చదువులను చదివించాడు. ఈ క్రమంలోనే అతని కుమారుడు నేనావత్ శ్రీను నాయక్‌కు గత ఆరు నెలల క్రితమే ఎస్‌ఐగా సెలెక్ట్ కావడంతో వికారాబాద్‌లో ట్రైనీ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు.

ఎస్‌ఐ విధులు నిర్వహిస్తున్న శ్రీనునాయక్‌కు గత వారం రోజుల క్రితమే చింతపల్లి మండల పరిధిలోని కొక్కిరాల తండాకు చెందిన యువతితో పెళ్లి అయ్యింది. ఈ క్రమంలో విధులకు హజరు కావడాని తన సోంత అటోలో తండ్రి మాన్యనాయక్ కొడుకును తీసుకుని వికారాబాద్‌కు అటోలో వెళ్తున్న క్రమంలో పోలేపల్లి రాంనగర్ గేటు సమీపంలో ఎదురుగా హైదరాబాద్ నుండి దేవరకొండకు వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీ కొనడంతో అటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు కుటుంబసభ్యుల్లో మాన్యనాయక్, శ్రీను నాయక్ అక్కడికక్కడే మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కొత్తగా పెళ్లి చేసుకుని కొత్త సంవత్సరంలో ఎన్నో ఆశలతో ఆనందంగా ఉన్న సమయంలో ఇలా జరగడంతో మృతుల ఇంట్లో రోదనలు స్థానికులకు కన్నీళ్లు పెట్టించాయి. ఎస్‌ఐగా ఉద్యోగం సంపాదించిన భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదుగుతాడని ఆశించిన తల్లికి తన కుమారునితో పాటు తన భర్త కూడా మృతి చెందడంతో శ్రీనునాయక్ తల్లి తల్లడిల్లిపోయింది, ఎన్నో కళలతో పెళ్లి చేసుకుని కొత్త సంసారంలో అడుగుపెడుదామని కలలు కన్న తన భర్త పదిహేను రోజుల్లోనే మృతి చెందడంతో అమ్మాయి యువతి బోరున విలపిస్తున్నది.

డిసెంబర్ 26న వివాహం… అంతలోనే విషాదం

వికరాబాద్ టౌన్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న నేనావత్ శ్రీనునాయక్ అతని తండ్రి ఇరువురు ఓకే ప్రమాదంలో మరణించడంతో విషాదం నెలకొంది. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలోని మాన్యతండాకు చెందిన నేనావత్ శ్రీను నాయక్, అయన తండ్రి మాన్యనాయక్ అసువులు బాసారు. వికరాబాద్‌లో శుభాకార్యంలో పాల్గొనేందుకు శ్రీను నాయక్ అతని తండ్రి, భార్య, బంధువులు బయలుదేరారు. తండ్రికి భుజం నోప్పి ఉండడంతో తండ్రికి తోడుగా ఉంటూ తాను తన తండ్రితో అటోలో వస్తా అని చెప్పి భార్య, బంధువులను కారులో పంపి శ్రీనునాయక్, మాన్యనాయక్‌లు అటోలో బయలుదేరగా ప్రమాదం జరిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

కాగా వికారాబాద్ టన్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనునాయక్ చింతపల్లి మండలంలోని బోత్యతండా సర్పంచ్ కోర్ర రవికి సమీప బంధువు కావడం, శ్రీను అత్తారింటి వారు బోత్యతండాకు చెందిన వారు కావడంతో ప్రమాధస్థలి వద్ద బంధువులు పెద్ద ఎత్తున చేరి కంటనీరు పెట్టారు. శ్రీనునాయక్‌కు డిసెంబర్ 26న వివాహం జరిగింది. వివాహం జరిగి పదిరోజులైన కాకముందే ఇలా జరగడంతో మాన్యతండాలో, బోత్యతండాలో విషాదచాయాలు నెలకొన్నాయి. సంఘటన స్థలాన్ని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, డిఎస్‌పి అనంద్‌రెడ్డి, నాంపల్లి సీఐ గుమ్మడిదల సత్యం తదితరులు సందర్శించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News