Wednesday, January 22, 2025

ప్రశాంతంగా ముగిసిన ఎస్సై పరీక్ష

- Advertisement -
- Advertisement -

SI exam ended peacefully

పర్యవేక్షించిన ముగ్గురు పోలీస్ కమిషనర్లు

హైదరాబాద్: ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 554 ఎస్సై పోస్టులకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్ష నిర్వహించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన పరీక్షకు పోలీస్ శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ముగ్గురు పోలీస్ కమిషనర్లు పరీక్ష కేంద్రాలను ఉదయం తనిఖీ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న 55 పరీక్షా కేంద్రాలను సిపి స్టిఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు 39,000మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన సిపి స్టిఫెన్ రవీంద్ర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడి పరీక్ష సజావుగా జరిగేలా చూడాలని కోరారు.

కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిభా డిగ్రీ కాలేజ్, వివేకానంద డిగ్రీ కాలేజీలోని పరీక్ష కేంద్రాలను, బాచుపల్లిలోని గోకరాజు రంగరాజు ఇనిస్టూట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, దుండిగల్‌లోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. సిపి వెంటనే లా అండ్ ఆర్డర్ ఎసిపి చంద్రశేఖర్, మాదాపూర్ ట్రాఫిక్ ఎసిపి హన్మంతరావు, కూకట్‌పల్లి ఇన్స్‌స్పెక్టర్ నర్సింగరావు తదితరులు ఉన్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మీర్‌పేటలోని టికెఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, శ్రీఇందు కాలేజీ, ఇబ్రహీపట్నం, రామంతపూర్‌లోని ప్రిన్స్‌టన్ డిగ్రీ కాలేజీ, ఘట్‌కేసర్‌లోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 55 పరీక్ష కేంద్రాలు ఉన్నాయని సిపి మహేష్ భగవత్ తెలిపారు. విద్యాశాఖ అధికారులతో కలిసి పోలీసులు సమన్వయం చేసుకుని పరీక్ష ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేశారని తెలిపారు. పరీక్ష రాసిన అభ్యర్తులు శారీరక దారుడ్య పరీక్షకు సిద్ధం కావాలని కోరారు. డిసిపి వెంట డిసిపి యాదగిరి, నారాయణరెడ్డి, శ్రీనివాస్, ఎడిసిపిలు శ్రీనివాస్, నర్మద తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News