Monday, December 23, 2024

ప్రశాంతంగా ముగిసిన ఎస్సై రాత పరీక్షలు

- Advertisement -
- Advertisement -

పరిశీలించిన సైబరాబాద్, రాచకొండ సిపిలు

మనతెలంగాణ, సిటిబ్యూరో: ఎస్సై మెయిన్స్ పరీక్షలు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం ప్రశాంతంగా ముగిశాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 24 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష కేంద్రాల్లో 19,973 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర బాలానగర్ జోన్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రతిభ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, జీడిమెట్ల, చింతల్‌లోని పాపయ్యయాదవ్ నగర్‌లోని రెయిన్ బో గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్స్ గర్ల్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను సందర్శించారు.

విధినిర్వహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని సిపి స్టిఫెన్ రవీంద్ర పోలీసులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడంతో ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతో పరీక్ష కేంద్రాలకు 500 మీటర్లలోపు నలుగురు కానీ అంతకంటే ఎక్కువ మంది గాని గుమికూడవద్దని సూచించారు. సిపి వెంట డిసిపిలు శ్రీనివాసరావు, డివి శ్రీనివాసరావు, ఎసిపి చంద్రశేఖర్, ధనలక్ష్మి, ఇన్స్‌స్పెక్టర్ నర్సింగరావు, నగేష్ తదితరులు ఉన్నారు.

పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశాంః డిఎస్ చౌహాన్, రాచకొండ సిపి ఎస్సై మొయిన్స్ పరీక్షల కోసం పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. రామంతాపూర్‌లోని ప్రిన్సిటన్ కళాశాల, టికెఆర్ కాలేజీలోని ఎస్సై పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు అందుబాటులో ఉంచాలని పరీక్షా కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. మహిళా అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. డిసిపి మల్కాజిగిరి జానకి, ఎసిపి నరేష్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News