Monday, December 23, 2024

ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డికి సిపి ఘన సన్మానం

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః తమ ప్రాణాలకు తెగించి 16 మంది ప్రాణాలను కాపాడిన పోలీసు అధికారులను హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ సి.వి. ఆనంద్ బుధవారం ఘనంగా సన్మానించారు. టిఎస్‌పిఎస్‌సిలో పోటీ పరీక్ష ప్రశ్న పత్రాల లీక్‌ను నిరసిస్తూ మంగళవారం ఎబివిపి ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు, కార్యకర్తలు ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు యత్నించడంతో వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పోలీసు వ్యాన్‌లో తరలిస్తున్న క్రమంలో డ్రైవర్‌కు ఫిట్స్ రావడం,

ఆ వాహనం అదుపు తప్పిన క్రమంలో బంజారా హిల్స్ సబ్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్‌రెడ్డి తన ప్రాణాలకు తెగించి దానిని అదుపు చేయడం ద్వారా ఎబివిపి నాయకులు, కార్యకర్తల ప్రాణాలను కాపాడంతో పాటు పెను ప్రమాదం నుంచి తప్పించారు. . దీంతో అక్కడ విధుల్లో ఉన్న పంజాగుట్ట సిఐ హరీష్ చంద్రరెడ్డితో పాటు బంజారాహిల్స్ సబ్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్‌రెడ్డిలను బుధవారం రవీంద్రభారతిలో నగర కమిషనర్ సి.వి.ఆనంద్ ప్రశంస పత్రం అందజేసి ఘనంగా సన్మానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News