Monday, December 23, 2024

ప్రయాణికుడి ముఖంపై తన్నిన ఎస్ఐ

- Advertisement -
- Advertisement -

చెన్నై: పోలీసులు వాహనాలను తనఖీ చేస్తుండగా కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో ఓ ప్రయాణికుడు బారికేడ్లను తొలగిస్తుండగా అతడి ముఖంపై ఎస్‌ఐ కాలితో తన్నిన సంఘటన తమిళనాడు రాష్ట్రం నాగపట్టణం జిల్లా నాగూర్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఎస్‌ఐని ఉన్నతాధికారులు సస్సెండ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వాంజూర్ రౌండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికులతో కలిసి బారికేడ్లను తొలగించారు. వెంటనే ఎస్‌ఐ పళనివేల్ ఆగ్రహంతో అక్కడికి చేరుకొని ఓ ప్రయాణికుడిపై దాడి చేశాడు. అంతే కాకుండా ప్రయాణికుడి ముఖంపై తన్ని స్టేషన్‌కు తరలించాడు. అక్కడ ఉన్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఉన్నతాధికారులు వెంటనే అతడిని సస్పెండ్ చేశారు.

Also Read: 40 మంది భార్యలకు భర్త ఒక్కడే కానీ…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News