బెంగళూరు: పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళతో ఓ ఎస్‌ఐ అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగికంగా వేధించిన సంఘటన కర్నాటక రాష్ట్ర బెంగళూరులోని సద్దుగుట్ట పాల్యా పోలీస్ స్టేషన్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. విడాకుల కేసుల విషయంలో ఓ మహిళ సంతకం చేయడానికి ఏప్రిల్ 8న సద్దుగుట్ట పాల్యా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఎస్‌ఐ మంజునాథ్ ఆమె చేతులను తాకాడు. వెళ్లిపోతుండగా ఆమె శరీర భాగాలను తాకడంతో అతడిని విడిపించుకొని బయటకు వెళ్లిపోయింది. ఆమెకు సదరు ఎస్ఐ సభ్యకరమైన సందేశాలు పంపించాడు. దీంతో ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి. ఆ పోస్టులపై కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో డిలీట్ చేసింది. కానీ అప్పటికే ట్విట్టర్‌లో వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు ఆమె కలిసి ఫిర్యాదు తీసుకున్నారు. 354ఎ, 354డి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డిసిపి సికె బాబా తెలిపాడు.
పోలీస్ స్టేషన్‌లో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఎస్ఐ
- Advertisement -
- Advertisement -
- Advertisement -