Monday, December 23, 2024

కర్నాటకలో రూ 80 లక్షలకు ఎస్‌ఐ పోస్టు

- Advertisement -
- Advertisement -

SI post in Karnataka for Rs 80 lakhs

కర్నాటకలో రూ 80 లక్షలకు ఎస్‌ఐ పోస్టు
అంతులేని అవినీతి తంతు : రాహుల్
పక్కదార్లు పట్టిన దళితుల నిధులు
బళ్లారిలో భారత్ జోడో యాత్ర 1000 కిమీ

బళ్లారి : బిజెపి పాలిత కర్నాటక రాష్ట్రంలో అవినీతి తంతు కమిషన్ల వారిగా పనికింత లెక్కకు మారిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్‌జోడో యాత్రలో భాగంగా కర్నాటకలోని బళ్లారికి చేరుకున్న రాహుల్ మున్సిపల్ గ్రౌండ్‌లో జరిగిన సభలో మాట్లాడారు. ఇక్కడి ప్రభుత్వం దళిత వ్యతిరేకి, ఎస్‌సి, ఎస్‌టి ఆదివాసీల హక్కులను హరిస్తోంది. అణగారిన వర్గాలపై జులుం పెరిగిందని మండిపడ్డారు. ఎస్‌సి/ఎస్‌టి వర్గాలకు చెందాల్సిన వారికి ఉద్ధేశించిన రూ 8,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించిందని రాహుల్ విమర్శించారు. రాష్ట్రంలోని ప్రభుత్వాన్ని అంతా ఇప్పుడు 40 శాతం కమిషన్ల ప్రభుత్వంగా పిలుస్తున్నారు. ఈ పనికి ఇంత అని రేటు తీసుకుని పనులు చేస్తున్నారని ఆరోపించారు. లంచాల రేట్లు విషయంలో ఇక్కడి బిజెపి ప్రభుత్వం పోటీపడుతోందని తెలిపిన రాహుల్ ఎవరైనా ఎస్‌ఐ కావాలనుకుంటే రూ 80 లక్షలు లంచం ఇస్తే చాలు , ఈ కుర్సీలో కూర్చోవచ్చునని, ఈ డబ్బులు ఇచ్చుకోలేనివారికి జీవితకాలంలో ఏ ఉద్యోగం రాదని రాహుల్ తెలిపారు.

ఈ విధంగా ఎస్‌ఐకు ఓ రేటు ఇతర ఉద్యోగాలకు మరో రేటు, కాంట్రాక్టులకు పనులను బట్టి ముడుపులు ఖరారయ్యాయని విమర్శించారు. ఇటీవల రాష్ట్రంలో ఎస్‌ఐల నియామక ప్రక్రియలో జరిగినస్కామ్ తదనంతర అరెస్టు పరిణామాలను రాహుల్ ప్రస్తావించారు. కో ఆపరేటివ్ బ్యాంక్‌లలో, అసిస్టెంటు ప్రొఫెసర్లనియామకాలలో కూడా అవినీతి ధరలు పలుకుతున్నాయని తెలిపారు. రాహుల్ జోడోయాత్ర బళ్లారికి ప్రవేశించిన దశలో వేయి కిలోమీటర్ల పాదయాత్ర మైలురాయి దాటింది. ఇక్కడ జరిగిన సభలో రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లోట్, స్థానిక కాంగ్రెస్ నేతలు, మాజీ సిఎం సిద్ధరామయ్య ఇతరులు కూడా మాట్లాడారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News