Thursday, January 23, 2025

ముగిసిన ఎస్ఐ రాజేంద్ర కస్టడీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో అరెస్టుయిన ఎస్ఐ రాజేంద్రను రాయదుర్గం పోలీసులు రెండు రోజులు విచారించారు. మహారాష్ట్రలో నైజీరియన్ నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను తన ఇంట్లో దాచి పెట్టి విక్రయించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మయం అయిన 250 గ్రాములు డ్రగ్స్ వివరాలు తెలుసుకునేందుకు ఎస్ఐ రాజేంద్రన్ కోసం రాయదుర్గం పోలీసులు కూకట్‌పల్లి కోర్టులో పిటిషన్ వేయగా కోర్టు రెండు రోజులు కస్టడీకి ఇచ్చింది. సైబరాబాద్ సైబర్ క్రైం ఎస్సైగా పనిచేస్తున్న రాజేంద్ర గత ఫిబ్రవరి నెలలో

ముంబాయికి వెళ్లిన సమయంలో నైజీరియన్‌ను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు. నైజీరియన్ నుంచి స్వాధీనం చేసుకున్న కిలో 700గ్రాములు డ్రగ్స్‌ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లకుండా ఇంట్లో దాచిపెట్టాడు. దానిని డ్రగ్స్ విక్రయించేవారికి అమ్మేందుకు ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నార్కోటిక్ బ్యూరో అధికారులకు తెలియడంతో వల వేసి పట్టుకున్నారు. అరెస్టు చేసి రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. కాగా రాజేంద్రన్‌ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News