Sunday, February 23, 2025

యువతిని లైంగికంగా వేధించిన ఎస్ఐ

- Advertisement -
- Advertisement -

SI sexually harassed young woman

ఆసిఫాబాద్: చట్టం చేతిలో ఉంది కదా అని కొందరు పోలీసులు రెచ్చిపోతున్నారు. బాధితులు కనిపిస్తే చాలు ఏదో ఒక రూపంలో వారిపై పంజా విసురుతున్నారు. హైదరాబాద్‌లో సిఐ ఓ మహిళపై అత్యాచారం చేసిన ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓ యువతిని ఎస్‌ఐ లైంగికంగా వేధించిన సంఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసు జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న ఓ యువతిని ఎస్‌ఐ పోన్ చేసి పోలీస్ స్టేషన్‌కు పిలిచాడు. పుస్తకాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చేలా చేస్తామని మాయమాటలు చెప్పి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో వెంటనే యువతి తన బంధువులకు సమాచారం ఇచ్చింది. అందరూ కలిసి ఎస్‌పికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. సదరు ఎస్‌ఐపై గత కొన్ని రోజుల నుంచి ఆరోపణలు వస్తుండడంతో ఇంటెలిజెన్స్ విభాగం విచారిస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News