Sunday, December 22, 2024

బల్బును ఎత్తుకెళ్లిన ఎస్ఐ…. సోషల్ మీడియాలో వైరల్

- Advertisement -
- Advertisement -

SI steals bulb from closed shop

మన తెలంగాణ/ ప్రయాగ్ రాజ్ న్యూస్: కంచె చేను మేసిన చందంగా.. దొంగలకు బుద్ధి చెప్పాల్సిన ఓ ఎస్‌ఐ దొంగతనం చేశాడు..  ఓ ఎస్‌ఐ రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఓ షాపు ముందు బల్బు కనిపించింది. వెంటనే అటు ఇటూ చూసి బల్బును తీసుకొని తన జేబులో వేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో జరిగింది. రాజేశ్ వర్మ అనే వ్యక్తి ప్రయాగ్ రాజ్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 7 రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాడు. ఓ షాపు ముందు బల్బు కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్లి ఇటు అటు చూశాడు. ఎవరికి లేకపోవడంతో బల్సు తీసుకొని జేబులో వేసుకొని వెళ్లిపోయాడు. వెంటనే ఆ ప్రాంతమంతా వీడియోలో చీకటిగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు ఎస్‌ఐని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బల్బు దొంగతనం చేయడం పెద్ద విషయం కాదని కానీ పోలీస్ అధికారి దొంగతనం చేయడమనేది డిపార్ట్‌మెంట్ చెడ్డ పేరు వస్తుందని ప్రయాగ్ రాజ్ ఎస్‌ఎస్‌సి శైలేష్ కుమార్ పాండే తెలిపాడు. సదరు ఎస్‌ఐని సస్పెండ్ చేసి విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. పుట్‌పాత్‌పై పాదచారులు నడుచుకుంటు వెళ్తుండగా ఓ వ్యక్తి ఫోన్‌ను కానిస్టేబుల్ కొట్టేసిన ఘటన గతంలో యుపిలోని కన్పూర్‌లో జరిగింది. గతంలో కాన్పూర్‌లోని మహారాజ్‌పూర్ ప్రాంతంలో రాత్రి సమయంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఓ కానిస్టేబుల్ నిద్రస్తున్న వ్యక్తి జేబులో నుంచి పోన్ దొంగలించాడు. సిసి కెమెరాలో రికార్డు కావడంతో అతడిని కూడా సస్పెండ్ చేశారు.

 

ఇవి కూడా చదవండి….

చందానగర్ లో భార్యను కత్తెరతో పొడిచి…. భర్త ఆత్మహత్య

సాదుకున్నందుకు చంపేసింది…

భార్య చేతి వేళ్లను నరికి…

ప్రేమోన్మాదానికి కూతురు, తండ్రి బలి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News