Tuesday, December 24, 2024

సమాచారం మాకు..బహుమతి మీకు

- Advertisement -
- Advertisement -

కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో శనివారం స్థానిక ఎస్‌ఐ సురేష్ ఆధ్వర్యంలో నిషేధిత మావోయిస్టు పార్టీ వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. గత కొన్ని సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ పూర్తిగా నశించి పోయిందని, ఎట్టి పరిస్థితుల్లో మండలంలో మావోయిస్టు కార్యకలాపాలకు అవకాశం లేదని, మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతామని ఎస్‌ఐ సురేష్ తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో ప్రధాన కూడళ్లలో, జన సంచారం అధికంగా ఉన్న చోట గోడలకు అనుమానితుల వాల్ పోస్టర్ అంటించడం జరిగిందని తెలిపారు.

ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, అనుమానిత వ్యక్తుల కదలికల సమాచారం ఇవ్వాలని కోరారు. మావోయిస్టుల సమాచారం పోలీస్‌శాఖకు ఇస్తే వాళ్ళ మీద ఉన్న బహుమతి సమాచారం ఇచ్చిన వారికి ఇవ్వడం జరుగుతుందని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని, సమాచారం మాకు…బహుమతి మీకు అంటూ ఎస్‌ఐ సురేష్‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్, సిఆర్‌పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News