Tuesday, January 21, 2025

మహిళా ఫిర్యాదితో అగౌరవంగా మాట్లాడిన ఎస్‌ఐ సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

బిజ్నోర్ (యుపి) : అత్యాచారం, వేధింపులపై ఫిర్యాదు చేసిన మహిళతో అగౌరవంగా మాట్లాడాడన్న నేరారోపణపై పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. తన అత్తామామలు అత్యాచారానికి, వేధింపులకు పాల్పడుతున్నారని ఒక మహిళ గత సెప్టెంబర్ 12 న ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసు దర్యాప్తు సమయంలో సబ్ ఇన్‌స్పెక్టర్ ధర్మేంద్రగౌతమ్ ఉద్దేశపూర్వకంగానే అగౌరవంగా మాట్లాడడం ఆమె రికార్డు చేసింది. ఈ ఆడియో రికార్డింగ్‌ను ఆమె బుధవారం అప్పగించిందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నీరజ్‌కుమార్ గురువారం వెల్లడించారు. దీనిపై మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్‌చే దర్యాప్తు చేయగా వాస్తవమని తేలిందని ఆయన చెప్పారు. నిందితుడు గౌతమ్ హాల్దర్ పోలీస్‌స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. దీనిపై అంతర్గత విచారణ జరుగుతుందని ఎస్‌పి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News