Thursday, January 23, 2025

యుకె ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ను నిర్వహించనున్న ఎస్‌ఐ–యుకె..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: యుకె కేంద్రంగా కలిగిన అంతర్జాతీయ ఎడ్యుకేషన్‌ కన్సల్టెంట్‌ ఆర్గనైజేషన్‌ ఎస్‌ఐ–యుకె ఇండియా, సుప్రసిద్ధ యుకె యూనివర్శిటీలతో భాగస్వామ్యం చేసుకుని త్వరలో తాము నిర్వహించనున్న ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ గురించి నేడు వెల్లడించింది. ఈ ఫెయిర్‌ ద్వారా విద్యార్ధులతో పాటుగా వారి తల్లిదండ్రులు కూడా సమగ్రమైన మార్గనిర్దేశనం, సమాచారం పొందగలరు. ఈ ఫెయిర్‌ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ వద్ద ఉన్న హయత్‌ ప్లేస్‌ హోటల్‌లో ఏప్రిల్‌ 16వ తేదీ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకూ జరుగనుంది.

ఈ ఫెయిర్‌ భారతదేశంలో ఏడు నగరాలలో జరుగనుంది. తొలుత థానెలో ఏప్రిల్‌ 14న జరుగుతుంది. అనంతరం గురుగ్రామ్‌, విజయవాడ, హైదరాబాద్‌, చండీఘడ్‌, కోయంబత్తూరు, కొచిలలో జరుగనుంది. ఈ ఫెయిర్‌లో సుప్రసిద్ధ యూనివర్శిటీలైన యూనివర్శిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌, యునివర్శిటీ ఆఫ్‌ బర్మింగ్‌ హామ్‌, క్వీన్స్‌ యూనివర్శిటీ బెల్‌ఫాస్ట్‌, యూనివర్శిటీ ఆఫ్‌ ఎక్టెర్‌ మొదలైనవి ఉన్నాయి.

ఈ ఫెయిర్‌లో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు యుకెలో విద్యావకాశాలు గురించి తెలుసుకోవడంతో పాటుగా అడ్మిషన్‌ పొందేందుకు అవసరమైన అర్హతలు, స్కాలర్‌షిప్‌లు, యుకెలో విద్యార్ధి జీవితం గురించి కూడా తెలుసుకోవచ్చు. అంతర్జాతీయ నిపుణులతో ముఖాముఖి చర్చలు జరిపే అవకాశం కలగడంతో పాటుగా యుకె యూనివర్శిటీల ప్రతినిధుల నుంచి నేరుగా తమ సందేహాలను తీర్చుకునే అవకాశమూ కలుగుతుంది.

ఎస్‌ఊ–యుకె ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మి అయ్యర్‌ మాట్లాడుతూ ‘‘ విదేశీ విద్య అనేది జీవితాన్ని మార్చే అనుభవం. విద్యార్ధులకు ఖచ్చితమైన, ఆధారపడతగిన సమాచారం అందించడంతో పాటుగా తమ భవిష్యత్‌ గురించి తగిన సమాచారం పొందగలరు. ఈ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ ద్వారా యుకెలో విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులకు సమస్త సమాచారం, మార్గనిర్దేశనం, మద్దతు లభిస్తుంది’’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News