Thursday, November 21, 2024

ఎస్ఐ ఆత్మహత్య….. ప్రియురాలు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

SI Vijay Kumar commit suicide

అమరావతి: ప్రియురాలు వేధింపులతో గుడివాడ ఎస్‌ఐ పి. విజయకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని డిఎస్‌పి ఎన్. సత్యానందం, సిఐ వి. దుర్గారావు మీడియాకు వివరించారు. దీంతో ప్రియురాలును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్నప్పుడు ఓ వివాహితతో విజయ్ కుమార్ అక్రమ సంబంధంపెట్టుకున్నాడు. సోషల్ మీడియాలో విజయ్ కుమార్, తన ప్రియురాలు ఫోటోలు కనిపించడంతో ఆమె భర్త స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్‌ఐ విజయ్ కుమార్ సస్పెండ్ చేశారు. ఆమె భర్త విడిచిపెట్టి విజయ్‌తో సహజీవనం చేస్తోంది. రెండు నెలల క్రితం విజయ్ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ప్రియురాలు తనని కూడా పెళ్లి చేసుకోవాలని విజయ్‌ను మానసికంగా వేధించడంతో ఉరేసుకున్నాడు. దీంతో ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని డిఎస్ పి  తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News