Thursday, December 26, 2024

పోగొట్టుకున్న బ్యాగుని ఇచ్చిన ఎస్సై విజయ్ నాయక్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్: బ్యాగు పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగి ఇవ్వడంతో పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సంఘటన ఆదివారం గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గచ్చిబౌలి చౌరస్తా వద్ద ఎస్సై విజయ్ నాయక్, కానిస్టేబుల్ హన్మంతు విధులు నిర్వర్తిస్తున్నారు. ఉదయం 6.30 గంటలకు బ్యాగు తమకు సమీపంలో పడిపోయింది. చాలా సేపు నుంచి బ్యాగును చూస్తున్న పోలీసులు ఎవరూ వచ్చి తీసుకోకపోవడంతో వారే వెళ్లి తీసుకుని వచ్చారు.

దానిని ఎస్సై, కానిస్టేబుల్ కలిసి ఓపెన్ చేసి చూడగా అందులో పాస్‌పోర్టు, బ్యాంక్ అకౌంట్, చెక్‌బుక్, ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఉద్యోగం అపాయింట్‌మెంట్ లెటర్ తదితరాలు ఉన్నాయి. చెక్‌బుక్‌పై ఉన్న మొబైల్ నంబర్‌ను గమనించి దాని ఆధారంగా కర్నాటక రాష్ట్రం, గుల్బర్గాకు చెందిన హరిమోహన్ దాస్ది బ్యాగుగా తెలుసుకున్నాడు. వెంటనే అతడికి ఫోన్ చేసి సమాచారం అందించాడు. తాను బ్యాగు కోసం వెతుకుతున్నానని చెప్పాడు. వెంటనే గచ్బిబౌలి చౌరస్తాకు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరాడు. బాధితుడు వచ్చి బ్యాగును తీసుకున్నాడు. బ్యాగులో తన ఒరిజినల్ సిర్టిఫికేట్లు ఉన్నాయని, దాని కోసం ఉదయం నుంచి వెతుకుతున్నానని బ్యాగు తిరిగి ఇచ్చిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News