Monday, December 23, 2024

స్వియాటెక్‌కు షాక్

- Advertisement -
- Advertisement -

కెనడా ఓపెన్

ఒనటారియో : కెనడా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్)కు చుక్కెదురైంది. మహిళల సింగిల్స్‌లో స్వియాటెక్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. బ్రెజిల్‌కు చెందిన అన్‌సీడెడ్ బియార్టిజ్ హద్దాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇగా ఓటమి పాలైంది. మూడు సెట్ల హోరాహోరీ పోరులో బియార్టిజ్ 63, 36, 75 తేడాతో ఇగాను కంగుతినిపించింది. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. తొలి సెట్‌లో బియార్టిజ్ జయకేతనం ఎగుర వేసింది. కానీ రెండో సెట్‌లో మాత్రం జోరును కొనసాగించింది. దూకుడైన ఆటతో సెట్‌ను సొంతం చేసుకుంది. అయితే ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో మాత్రం ఇగాకు పరాజయం తప్పలేదు.

టైబ్రేకర్ వరకు సాగిన సెట్‌లో బియార్టిజ్ విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు మూడో సీడ్ మారియా సక్కారి (గ్రీస్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓటమి చవిచూసింది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన 14వ సీడ్ కరోలినా ప్లిస్కోవాతో జరిగిన పోరులో సక్కారి పరాజయం పాలైంది. నువ్వానేనా అన్నట్టు సాగిన మూడు సెట్ల సమరం లో ప్లిస్కోవా 61, 67, 63 తేడాతో సక్కారిని ఓడించింది. మరో మ్యాచ్‌లో 12వ సీడ్ బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్) విజయం సాధించింది. స్పెయిన్‌కు చెందిన 8వ సీడ్ గార్బయిన్ ముగురుజాతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో బెలిండా 61, 63తో అలవోక విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఇక చైనా క్రీడాకారిణి జిన్‌వెన్ జెంగ్ కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మూడు సెట్ల సమరంలో జెంగ్ 75, 57, 62తో కెనడా క్రీడాకారిణి బియాంకా అండ్రెస్కోపై విజయం సాధించిం ది. కాగా, పురుషుల సింగిల్స్ ఫెలిక్స్ అగర్ (కెనడా), నిక్ కిర్గియాస్ (ఆస్ట్రేలియా), డాన్ ఎవాన్స్ (బ్రిటన్) తదితరులు క్వార్టర్స్‌కు చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News