తెలంగాణలో పెను ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పాస్‌పోర్టును పాస్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. ఆయనపై రెడ్ కార్నర్ నోటీసులతో అథారిటీ ఈ నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తన ఆరోగ్యం బాగోలేదని.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని, ఇండియాకు రాలేనని తప్పించుకునే ప్రయత్నిస్తుండటంతోొ.. తెలంగాణ పోలీసులు, కేంద్ర ప్రభుత్వం, యూఎస్ కాన్సులేట్ సహాయంతో ప్రభాకర్ రావును ఇండియాకు తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
కాగా, ఈ కేసులో ఏ6గా ఉన్న శ్రవణ్ రావు మంగళవారం సిట్ అధికారులు విచారించారు. గత ఎన్నికల సందర్భంగా శ్రవణ్ రావు వాడిన రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు.. సెల్ ఫోన్‌లలోని సమాచారం ఆధారంగా ప్రశ్నించారు.