Wednesday, January 22, 2025

టిటిడి సభ్యులుగా శిద్దా సుధీర్ కుమార్ ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తిరుమల టిటిడి ధర్మకర్తల పాలక మండలి సభ్యులుగా సుధీర్ కుమార్ బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో టిటిడి అధికారులు శిద్దా సుధీర్ కుమార్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా వచ్చిన శిద్దా సుధీర్ కుమార్ మహాద్వారం వద్ద టిటిడి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శిద్దా సుధీర్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.

ఆ తరువాత శ్రీ వకుళామాత, శ్రీ విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, శ్రీభాష్యకార్ల సన్నిధి, శ్రీ యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు . రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. టిటిడి ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందించారు. అలిపిరి లోని సప్త గోప్రదక్షిణ మందిరాన్ని దర్శించి గో పూజలో పాల్గొని పాదాల మండపంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమలలో శ్రీవరాహ స్వామిని కూడా దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు దంపతులు, ఎమ్మెల్యే చెవిరెడ్డి జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, ఇత్ర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News