Monday, January 20, 2025

మనస్తాపంతో ఉరేసుకున్న బసవ సిద్ధలింగ స్వామి!

- Advertisement -
- Advertisement -

 

Basava Siddalinga Swamy

బెలగావి: కర్ణాటకలో పీఠాధిపతులపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘పోక్సో’ కేసులో చిత్రదుర్గ మురుగ మఠాధిపతి శివమూర్తి శరణారు ఏకంగా అరెస్ట్‌ అయ్యాడు. హైస్కూల్ స్టూడెంట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో ప్రస్తుతం శివమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. తాజాగా ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొన్న మఠాధిపతి ఒకరు సోమవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు.

బెలగావిలోని శ్రీ గురు మదివాలేశ్వర్‌ మఠ్‌కు చెందిన బసవ సిద్ధలింగ స్వామి ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నాడు. ఘటనాస్థలంలో సూసైడ్‌ నోట్‌ దొరికింది. అయితే అందులో ఏముందనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు. తన క్వార్టర్స్‌లోనే ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు అనుచర గణం పోలీసులకు వెల్లడించింది.  తాజాగా ఇద్దరు కర్ణాటకలోని మఠాలలో జరుగుతున్న లైంగిక దాడుల గురించి ప్రస్తావిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అది సంచలనంగా మారింది అక్కడ. అందులో లింగాయత్‌ కమ్యూనిటీకి చెందిన బసవ సిద్ధలింగ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఆయన మనస్తాపం చెంది ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News