- Advertisement -
కామారెడ్డి : కామారెడ్డి కలెక్టరేట్ లో సోమవారం ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. వివరాలలోకి వెళితే.. మద్నూర్ మండలానికి చెందిన సిద్దప్ప అనే యువకుడు స్థానిక మార్కెట్ యార్డులో రెండేళ్ల క్రితం జరిగిన అవినీతిపై ఆ కమిటీ ఆర్టిఐ ద్వారా వివరాలు కోరారు.
అధికారులు అతనికి వివరాలు ఇవ్వకపోడంతో అతను డిల్లీకి వెళ్లి కమీషనర్ కు ఫిర్యాదు చేసినా స్పందన రాలేదు. పైగా అతనిపై కేసులు పెట్టడంతో ఆవేదనకు గురైయ్యాడు. ఈ క్రమంలో సిద్దప్ప కలెక్టర్ కార్యాలయంలో ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
- Advertisement -