Monday, December 23, 2024

కాంగ్రెస్ అధిష్టానానిదే తుది నిర్ణయం: 3 డిప్యుటీ సిఎంల డిమాండుపై సిద్దరామయ్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: మరో ముగ్గురు ఉప ముఖ్యమంత్రులను నియమించాలన్న డిమాండు కర్నాటకలో మరోసారి తెరపైకి రావడంతో దీనిపై కాంగ్రెస్ అధిషానానిదే తుది నిర్ణయమని ముఖ్యమంత్రి సిద్దరామయ్య బుధవారం స్పష్టం చేశారు. వీరశైవ-లింగాయత్, ఎస్‌సి/ఎస్‌టి, మైనారిటీ వర్గాలకు చెందిన కాంగ్రెస్ నాయకుల నుంచి ముగ్గురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలంటూ కొందరు మంత్రులు డిమాండు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పందించారు. ప్రస్తుతం వొక్కలిగ కులానికి చెందిన డికె శివకుమార్ ఒక్కరే సిద్దరామయ్య క్యాబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.

కాంగ్రెస్ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందని బుధవారం విలేకరులతో మాట్లాడుతూ సిద్దరామయ్య తెలిపారు. కాగా..ఇదే విషయమై మంగళవారం ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ కూడా విలేకరుల వద్ద స్పందిస్తూ కాంగ్రెస్ అధిష్టానమే దీనిపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఈ డిమాండుపై ఆయన తీవ్రంగా అసంతృప్తి చెందుతున్నట్లు తెఉస్లోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News