Wednesday, April 23, 2025

కర్ణాటక సిఎం, డిప్యూటి సిఎంను చంపేస్తాం..

- Advertisement -
- Advertisement -

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను, డిప్యూటి సిఎం డీకే శివ కుమార్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. సింధార్ రాజపుత్ పేరుతో బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు విధానసౌద స్టేషన్ పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇద్దరు నాయకులను చంపి, వారి మృతదేహాలను రిఫ్రిజిరేటర్, ట్రాలీ బ్యాగ్‌లో నింపుతామని మెయిల్ లో హెచ్చరించారు.

ఈమెయిల్‌ ప్రకారం.. రాంపురకు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తికి తాను కోటి రూపాయలు అప్పుగా ఇచ్చానని, దానిని ఇంకా తిరిగి చెల్లించలేదని రాజ్‌పుత్ పేర్కొన్నాడు. ప్రభాకర్ వెంటనే డబ్బును తిరిగి ఇవ్వాలని, అలా చేయకపోతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని చంపేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో బెదిరింపు ఇమెయిల్ పై ఉన్నత స్థాయి పోలీసు బృందం దర్యాప్తును ప్రారంభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News