Thursday, December 19, 2024

30 మందితో కూడిన కర్నాటక కేబినెట్‌

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. ఆయన 30 మందితో కూడిన కేబినెట్‌ను నడిపించనున్నారని సమాచారం. కర్నాటక కాంగ్రెస్‌కు 136 సీట్లు ఉన్నాయి. కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ కూడా ప్రమాణస్వీకారం చేశారు .
కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కేబినెట్‌కు అభ్యర్థులను ఎంచుకునే అధికారాన్ని సిద్ధరామయ్యకు, శివకుమార్‌కు ఇచ్చింది. వీరు చెరో 10 మంది అభ్యర్థులను కేబినెట్‌కు ఎంపికచేస్తారని సమాచారం. నేడు(శనివారం) కర్నాటక మంత్రుల ప్రమాణస్వీకారం జరుగనున్నది. ఇందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ముఖ్యమంత్రులు, ఓ తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధికి ఆహ్వానం అందిందని సమాచారం. కర్నాటక కేబినెట్ గరిష్ఠ పరిమితి 34. కాగా సిద్ధరామయ్య, శివకుమారం కలిసి 20 మందిని ఎంపికచేయనున్నారు. మిగతా వాటికి కాంగ్రెస్ నాయకత్వం అభ్యర్థులను ఎంపిక చేసింది. నాలుగు నుంచి ఐదు సీట్లను ఖాళీగా ఉంచింది.
ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగా డికె.శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్ అతిథులుగా పాల్గొననున్నారు. అతిథుల జాబితాలో వారి పేర్లున్నాయి. ఇంకా యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నారు. ఇక పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు బదులుగా తన ప్రతినిధి కకోలి ఘోష్ దస్తిదార్‌ను ప్రమాణస్వీకారోత్సవానికి పంపుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కూడా మమతా బెనర్జీ వలే తనకు బదులుగా మరొకరిని పంపుతున్నారు. ఆహ్వానితుల జాబితాలో కేరళ సిఎం పినరయి విజయన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పేర్లు లేవని కర్నాటక రాజ్యసభ ఎంపీ నశీర్ హుస్సైన్ తెలిపారు. ఆయన అతిథుల జాబితాను చూసి ఈ విషయం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News