Monday, December 23, 2024

ఆ ఎమ్‌ఎల్‌ఎలకు బీజేపీ రూ.50 కోట్లు ఆఫర్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలకు రూ .50 కోట్లు ఆఫర్ చూపించి కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామ్య ఆరోపించారు. ఓ మీడియా ఇంటర్వూలో ఆయన మాట్లాడారు. “ గత ఏడాది నుంచి బీజేపీ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తోంది. అందులో భాగంగానే ఆపరేషన్ కమలం చేపట్టింది. మా ఎమ్‌ఎల్‌ఎలకు రూ. 50 కోట్లు ఇచ్చింది. కానీ బీజేపీ వారి ప్రయత్నం వృధా అయింది ” అని సిద్ధరామయ్య అన్నారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో గెలవకపోతే పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు స్పందిస్తూ “ మా ప్రభుత్వానికి ఏం కాదు. మా ఎమ్‌ఎల్‌ఎలు ఎవ్వరూ పార్టీ మారరు. కనీసం ఒక్క ఎమ్‌ఎల్ ఎ కూడా కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టరు. నా నాయకత్వం లోనే ఐదేళ్ల పాటు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది” అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News