Monday, December 23, 2024

ప్రచారాల హోరు… సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

ప్రచారాల హోరుతో కర్ణాటక దద్దరిల్లుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే పలు ప్రచార ర్యాలీల్లో కాషాయ పార్టీపై విమర్శనాస్త్రాలు ప్రయోగించారు. మాజీ సిఎం కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య బుధవారం వరుణ నియోజక వర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు.వాస్తవానికి ఈ నియోజక వర్గం నుంచి ఆయన తనయుడు యతీంద్ర గత ఎన్నికల్లో ఎమ్‌ఎల్‌ఎగా నెగ్గారు.

అయితే సిద్దూ మరో నియోజక వర్గం నుంచి కూడా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. వరుణలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఇవే తనకు ఆఖరు ఎన్నికలని, ఈ ఎన్నికల తర్వాత తాను రాజకీయాలకు గుడ్‌బై చెబుతానన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది పార్టీ అధిష్ఠానమే నిర్ణయిస్తుందన్నారు. అవినీతి సర్కార్‌ను సాగనంపే కాంగ్రెస్‌కు అధికార పగ్గాలు అప్పగించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అనేది సెక్యులర్ పార్టీ అని, కులాల ఆధారంగా ఓట్లు అడగదని ఆయన స్పష్టం చేశారు.

జగదీష్ శెట్టార్ నామినేషన్ దాఖలు
బీజెపీని విడిచిపెట్టి ఇటీవలనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ సిఎం జగదీశ్ శెట్టార్ హుబ్లిధార్వాడ్ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ నియోజక వర్గం నుంచి భారీ మెజారిటీతో తాను విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి మహేష్ టెంగిన్ కై తో ఆయన పోటీ పడుతున్నారు. కర్ణాటక అసెంబ్లీలో బీజేపీని మట్టి కరిపించాలని కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఎలాగైనా అధికారం నిలబెట్టుకోడానికి కమలం వ్యూహాలు రూపొందిస్తోంది. ఇక ఈ రెండు పార్టీల కన్నా తాము విశేష సంఖ్యలో ఓట్లను సాధించుకోవాలని జెడీఎస్ ప్రయత్నిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News