Monday, January 20, 2025

సిద్ధరామయ్యకే రాహుల్ గాంధీ మద్దతు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కర్నాటకలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది కొలిక్కి వస్తున్నట్లు కనబడుతోంది. డికె. శివకుమార్ కంటే సిద్ధరామయ్యకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి(ఆర్గనైజేషన్) కెసి. వేణుగోపాల్…సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రి పదవికి బలపరుస్తున్నారని అభిజ్ఞవర్గాల వల్ల తెలిసింది. అంతేకాక మెజారిటీ ఎంఎల్‌ఏలు సిద్ధరామయ్యకే మద్దతు ఇస్తున్నారని కూడా సమాచారం. ఇదిలావుండగా డికె. శివకుమార్‌కు సోనియా గాంధీపై గురి ఉన్నట్లు కూడా వినిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎవరి వైపు మొగ్గడం లేదని తెలిసింది. కానీ కర్నాటక ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకునే బరువును కాంగ్రెస్ ఖర్గేపైనే పెట్టింది. ఇక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలా కర్నాటక పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జీగా కూడా ఉన్నారు. ఆయన కూడా ఈ వ్యవహారంలో తటస్థంగా ఉన్నట్లు సమాచారం. కర్నాటకలోని 224 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్‌కు 135 సీట్లున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News