Thursday, December 26, 2024

ఎంఐఎం నేతలపై క్రిమినల్ కేసుల ఉపసంహరణ..సిద్దరామయ్య ప్రభుత్వ నిర్ణయం

- Advertisement -
- Advertisement -

పోలీసులపై దాడి చేసి పోలీసు స్టేషన్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన మూకలకు నాయకత్వం వహించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎఐఎంఐఎం నాయకుడు మొహమ్మద్ ఆరిఫ్, మరో 138 మందిపై క్రిమినల్ కేసులను ఉపసంహరించాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది. 2022 ఏప్రిల్‌లో హుబ్బలిలో జరిగిన అల్లర్ల సందర్భంగా హింసాకాండను ప్రేరేపించినట్లు కూడా వీరిపై కేసులు ఉన్నాయి. వీరిపై ఉన్న కేసులలో క్రిమినల్ ఆరోపణలతోపాటు హత్యాయత్నం, అల్లరు వంటివి కూడా ఉన్నాయి. ప్రాసిక్యూషన్, పోలీసులు, న్యాయ శాఖ నుంచి అభ్యంతరం వ్యక్తమైనప్పటికీ ప్రభుత్వం వీరిపై కేసులను ఉపసంహరించుకుంది.

ఎఐఎంఐఎం నాయకుడితోపాటు 138 మంది ఇతరులపై నమోదైన కేసులను ఉపసంహరించాలని కోరుతూ కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ 2023 అక్టోబర్‌లో అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ కు లేఖ రాశారు. ఉప ముఖ్యమంత్రి సిఫార్సు మేరకు సంబంధిత కేసులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లు, సాక్షుల వాంగ్మూలాలతోసహా అవసరమైన సమాచారాన్ని రాష్ట్ర హోం శాఖ సేకరించింది. కాగా..కేసుల ఉపసంహరణ నిర్ణయంపై ప్రతిపక్ష బిజెపి రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టింది. ముస్లింలను సంతుష్ట పరచడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందంటూ బిజెపి ఆరోపించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News