Sunday, November 17, 2024

ఢిల్లీలో కర్నాటకం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది సోమవారం కూడా తేలలేదు. సీనియర్ నేత సిద్ధరామయ్య, పిసిసి అధ్యక్షులు డికె శివకుమార్ మధ్య సిఎం పీఠం కోసం పోటీ తీవ్రస్థాయిలో ఉంది. కాగా సోమవారం అనూహ్య పరిణామంగా డికె శివకుమార్ తమ ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇప్పటికే ఢిల్లీలో సిద్ధరామయ్య మకాం వేసి ఉన్నారు. ఈ దశలోనే డికె కూడా ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్లుతారని, అక్కడ పార్టీ పెద్దలతో తన అభిప్రాయాన్ని తెలియచేస్తారని ప్రచారం జరిగింది. అ యితే ఆ తరువాత ఆయన తాను ఢిల్లీకి వెళ్లడం లేదని తె లిపారు. దీనితో కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పా టు తీరు సాఫీగా సజావుగా సాగే పరిస్థితి లేదని స్పష్టం అయింది.

మరో వైపు బెంగళూరులో ఆదివారం నాటి సి ఎల్‌పిలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకున్న పార్టీ కేంద్ర పరిశీలకులు సుశీల్‌కుమార్ షిండే, జితేంద్ర సింగ్, దీపక్ బబారియాలు సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. వెంటనే వారు పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేను కలిశారు. పరిస్థితిని తెలిపారు. ఈ పరిశీలకుల వెంబడి పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, కర్నాటక పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి రణదీప్ సూర్జేవాలా కూడా ఉన్నారు. ఈ ఆరుగురు నేతలు సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. సిద్ధరామయ్య, డికెలలో సిఎం అభ్యర్థిత్వం పట్ల ఎమ్మెల్యేల మొగ్గు ఎటువైపు ఉందనేది పరిశీలకులైన పార్టీ సీనియర్ నేతలు తెలిపినట్లు వెల్లడైంది. సిఎం ఎవరు కావాలి? ప్రభుత్వ ఏర్పాటులో పద్ధతుల గురించి విశ్లేషించుకున్న ట్లు తెలిసింది. కాంగ్రెస్ అధినాయకత్వం ఇప్పటికే డికెతో ఫోన్‌లో, సిద్ధరామయ్యతో నేరుగానూ మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

డికె అలకా? అనారోగ్యమా?
తనను, సిద్ధరామయ్యను పార్టీ నేతలు ఢిల్లీకి ఆహ్వానించారని, ఇద్దరు కలిసి రావాలని కోరారని ముందు డికె విలేకరులకు తెలిపారు. అయితే తాను తరువాత వెళ్లుతానని చెప్పిన డికె ఆ తరువాత కొద్ది గంటలకు తాను ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. తనకు కడుపునొప్పిగా ఉందని , మంటగా ఉందని , జ్వరం కూ డా వచ్చిందని, డాక్టర్లు వచ్చి చెకప్ చేయాల్సి ఉందన్నా రు. ఏదో ఇన్‌ఫెక్షన్ అయినట్లుగా ఉందని తెలిపిన డికె దయచేసి తనను విశ్రాంతిగా ఉండనిచ్చే బాధ్యత మీదేనని విలేకరులకు తెలిపారు. ఆ తరువాత ఆయన సన్నిహితులు కొందరు డికె పర్యటన రద్దు అయినట్లు తెలిపారు. సోమవారం అయితే ఆయన ఢిల్లీకి వెళ్లడం లేదని, తరువాతి సంగతి తరువాత తెలుస్తుందని వివరించారు.

ఆయనకు 85 మంది అయితే నాకు 135 మంది బలం
సిఎం పీఠంపై పట్టుతో డికె వ్యాఖ్యలు
సీనియర్ నేత సిద్ధరామయ్య తనకు 85 మంది ఎమ్మెల్యేల బలం ఉందని చెప్పడంపై డికె స్పందించారు. తన బలం 135 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అని, తను పిసిసి నేతగా సారధ్యం వహించిన తరువాతనే పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో 135 స్థానాలు దక్కించుకుందని తెలిపారు. తనకుంటూ సంఖ్యాబలం ఉండదని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తన మందీమార్బలమే అన్నారు. ఏది ఏమైనా హో టల్‌లో జరిగిన సిఎల్‌పి అనధికారిక భేటీలో వెలువడ్డ ఏకవాక్య తీర్మానానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు డికె తెలిపారు. పార్టీ అధినాయకత్వమే సిఎంను ఎంపికచేయాలని ఈ నిర్ణయం వారికే వదిలిపెడుతున్నట్లు ఇందులో తెలిపారని, దీనికి తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. తాను ఒంటరిని తనది ఒంటరి పోరు ఒంటరి విజయం అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు సిద్ధరామయ్యకు సవాలుగా భావిస్తున్నారు. ఈ రోజు తన పుట్టినరోజు (సోమవారం) తన ను అభినందించేందుకు జనం తరలివచ్చారని చెప్పారు. తాను కుటుంబంతో కలిసి ముందుగా గుడికి వెళ్లి ఆ తరువాత ఢిల్లీకి వెళ్లుతానని, అందుబాటులో ఉన్నవిమానం లో అక్కడికి చేరుకుంటానని చెప్పిన డికె తరువాత మనస్సు మార్చుకున్నారు.

ఖర్గే, సోనియా, రాహుల్‌ల ఇష్టానికే వదిలిపెట్టా
తాను సిఎం కావాలా? వద్దా అనే విషయాన్ని తాను సీనియర్ నేతలు సోనియా, రాహుల్, ఖర్గేలకు వదిలిపెడుతున్నట్లు, సిఎం ఎవరు కావాలనేది వారే ఖరారు చేస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.తనకు గెలుపోటములు సహ జం. ఓడినప్పుడు గుండెబలం, గెలిచినప్పుడు నిండుదనం తన వైఖరి అని డికె తెలిపారు. సంకీర్ణం ఆ తరువాత ప్రభుత్వ పతనం నుంచి ఇప్పుడు విజయకేతనం దశకు చేరామని, అన్నింటికి బాధ్యత తీసుకుంటేనే సరైన నాయకత్వం అవుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News