Thursday, January 23, 2025

సమైక్య రాగం: చేతులు కలిపిన సిద్దూ, శివ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డికె శివకుమార్ పేర్లను పార్టీ అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సమైక్యంగా పనిచేస్తామని వారిద్దరూ ప్రకటించారు. కన్నడిగుల ప్రయోజనాల పరిరక్షణ కోసం తమ చేతులు కలసికట్టుగా పనిచేస్తాయని సిద్దరామయ్య గురువారం ట్వీట్ చేశారు. ప్రజానుకూల, పారదర్శక, అవినీతి రహతి ప్రభుత్వాన్ని అందచేయడానికి, ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబంలా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.

తామంతా సమైక్యంగా ఉన్నామన్న సంకేతాన్ని ఇచ్చేందుకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కెపిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్‌తో కలసి చేతులు పైకెత్తిన ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ఎంపికైన డికె శివకుమార్ కూడా ఇదే ఫోటోను ట్విటర్‌లో షేర్ చేస్తూ కర్నాటక రాష్ట్ర భద్రమైన భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల సంక్షేమం తమ ప్రధాన ప్రాధాన్యతని పేర్కొన్నారు. అందుకు కట్టుబడి తామంతా సమైక్యంగా పనిచేస్తామని ఆయన ట్వీట్ చేశారు. ఈ ఇద్దరు నాయకులు ఇతర క్యాబినెట్ సహచరులతో కలసి మే 20న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News