Monday, December 23, 2024

కర్నాటక పోర్ట్‌ఫోలియో: సిద్ధరామయ్యకు ఆర్థిక శాఖ, శివకుమార్‌కు నీటిపారుదల శాఖ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేడు తన క్యాబినెట్‌లో మంత్రుల శాఖలు (పోర్ట్‌ఫోలియోలు) కేటాయించారు. ఆర్థిక శాఖను తానే ఉంచుకుని, నీటిపారుదల శాఖనుఉ ఉపముఖ్యమంత్రి డికె. శివకుమార్‌కు కేటాయించారు. సిద్ధరామయ్య మే 20న శివకుమార్, ఎనిమిది మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేశారన్నది తెలిసిన విషయమే. తర్వాత ఆయన శనివారం తన మంత్రివర్గంలో కొత్తగా మరి 24 మంది ఎంఎల్‌ఏలను చేర్చుకున్నారు. ఇదివరలో హోమ్ శాఖను నిర్వహించిన జి.పరమేశ్వర్‌కు మళ్లీ ఆ శాఖనే కేటాయించారు. పెద్ద, మధ్య తరహా పారిశ్రామిక శాఖను ఎంబి. పాటిల్‌కు, ఇంధన శాఖను కెజె జార్జ్‌కు కేటాయించారు. దీనికి సంబంధించిన ప్రకటనను కర్నాటక ప్రభుత్వం ఆదివారం రాత్రి విడుదలచేసింది.

13 రాష్ట్ర బడ్జెట్‌లను సమర్పించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆర్థిక శాఖను మాత్రమే కాక, క్యాబినెట్ వ్యవహారాలు, సిబ్బంది, పాలక సంస్కరణల శాఖ, ఇంటెలిజెన్స్, ఇన్‌ఫార్మేషన్, ఐటి అండ్ బిటి, మౌలికవసతుల అభివృద్ధి, కేటాయించని ఇతర శాఖలను నిర్వహించనున్నారు.

శివకుమార్‌కు అన్ని భారీ, మధ్య తరహా నీటిపారుదల శాఖలు, బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బిబిఎంపి) సహా బెంగళూరు సిటీ డెవలప్‌మెంట్ శాఖ, బెంగళూరు నీటి సరఫరా,మురుగు నీటి పారుదల బోర్డు, బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వంటి శాఖలను కేటాయించారు. శివకుమార్ పొరుగున ఉండే రామనగర జిల్లాకు చెందిన వారైనప్పటికీ ఆయనకే బెంగళూరు సిటీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ కేటాయించారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే బెంగళూరుకు చెందిన ఐదుగురు ఎంఎల్‌ఏలు క్యాబినెట్‌లో ఉన్నారు. రాబోయే బిబిఎంపి ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మంత్రుల శాఖలను కేటాయించారు.

హెచ్.కె.పాటిల్‌కు న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాలు, శాసనసభ, టూరిజం శాఖను కేటాయించారు. మాజీ కేంద్ర మంత్రిగా ఉండిన కె.హెచ్.మునియప్పకు ఫుడ్ అండ్ సివిల్ సప్లయ్స్, వినియోగదారుల వ్యవహారాల శాఖను కేటాయించారు. కాగా రామలింగా రెడ్డికి రవాణ మంత్రిత్వశాఖ, ముజ్రాయ్ శాఖలను కేటాయించారు. రవాణా శాఖ తనకొద్దని రామలింగా రెడ్డి భీష్మించుకోగా, శివకుమార్ ఆయన ఇంటికి వెళ్లి కలిసి ఒప్పించారని వార్త. ఇక దినేశ్ గుండు రావుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖను కేటాయించారు. హెచ్.సి మహాదేవప్పకు సామాజిక సంక్షేమ శాఖను కేటాయించారు. సతీశ్ జరకిహోలికి పబ్లిక్ వర్క్, కృష్ణ బైరెగౌడకు రెవెన్యూ శాఖలను కేటాయించారు. ప్రియాంక ఖర్గేకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ, శివానంద పాటిల్‌కు జౌళి శాఖ, చెరకు అభివృద్ధి, డైరెక్టరేట్ శాఖలు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖలు కేటాయించారు. బిజెడ్. జమీర్ అహ్మద్ ఖాన్‌కు హౌసింగ్, వక్ఫ్, మైనారిటీ సంక్షేమ శాఖ, శరనబాసప్ప దర్శనపుర్‌కు చిన్న పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ శాఖ, ఈశ్వర్ ఖంద్రేకు అడవులు, పర్యావరణ శాఖ, ఎన్. చెలువరాయస్వామికి వ్యవసాయ శాఖ, ఎస్.ఎస్.మల్లికార్జున్‌కు మైన్స్ అండ్ జియోలజీ, హర్టికల్చర్ శాఖ, రహీమ్ ఖాన్‌కు మున్సిపాల్ పాలను, హజ్ శాఖ, సంతోష్ ఎస్.లాడ్‌కు కార్మిక శాఖను కేటాయించారు.

క్యాబినెట్‌లో ఉన్న ఒక్క మహిళా మంత్రి లక్ష్మీ ఆర్. హెబ్బాల్కర్‌కు మహిళా, శిశు అభివృద్ధి, వికలాంగులు, సీనియర్ సిటిజెన్ల సాధికారత శాఖను కేటాయించారు. కాగా శరణప్రకాశ్ రుద్రప్పకు వైద్య విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖను కేటాయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News