Wednesday, November 13, 2024

కర్ణాటక వాటా జలాల కోసం మహా సిఎం షిండేకు సిద్ధరామయ్య లేఖ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్ణాటక, మహారాష్ట్ర మధ్య జలాల పంపిణీ సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. వర్నా/కొయినా రిజర్వాయర్ నుంచి క్రిష్ణానదికి, ఉజ్జయిని రిజర్వాయర్ నుంచి భీమా నదికి తాగునీటి కోసం నీటిని విడిచిపెట్టాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య బుధవారం అభ్యర్థించారు. ఈమేరకు షిండేకు లేఖ పంపించారు. ఈ లేఖలో మహారాష్ట్ర డిపూటీ సిఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఉద్దేశించి కర్ణాటక ఉత్తర జిల్లాల్లో వేసవి కారణంగా తీవ్రమైన నీటి ఎద్దడి వ్యాపించిందని తెలియజేశారు. గత మార్చి నుంచి వేసవి కారణంగా బెలగావి, విజయ్‌పుర, బగల్‌కోట్, కలబురగి, యాదగిరి, రాయిచూర్ జిల్లాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఏర్పడిందని వివరించారు.

వర్నా/కొయినా రిజర్వాయర్ నుంచి క్రిష్ణా నదికి 3 టిఎంసి, ఉజ్జయిని రిజర్వాయర్ నుంచి భీమా నదికి 3 టిఎంసిలు నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం ఇదివరకే అభ్యర్థించిందని లేఖలో ఉదహరించారు. ఆ మేరకు మే మొదటి 15 రోజుల్లో క్రిష్ణానదికి మహారాష్ట్ర ఒక టిఎంసి నీటినే మహారాష్ట్ర ప్రభుత్వం విడిచిపెట్టిందని గుర్తు చేశారు. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి సిద్ధ రామయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. ఉత్తర జిల్లాల్లో ప్రజలకు, పాడిపశువుల అవసరాలకు కావలసిన నీటి కరవు ఏర్పడిందని, రుతుపవనాలు ఇంకా ప్రారంభం కావలసి ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు తక్షణం నీటిని విడిచిపెట్టేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని సిద్ధరామయ్య కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News