Tuesday, April 29, 2025

ప్రధాని మోడీని కలుసుకున్న సిద్దరామయ్య

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కర్నాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి
సిద్దరామయ్య గురువారం ప్రధాని నరేంద్ర మోడీని న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో కలుసుకున్నారు.

వారిద్దరి మధ్య సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం(సిఎంఓ) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాని మోడీని పూలమాల వేసి అభివాదాలు తెలియచేసిన సిద్దరామయ్య చందనంతో తయారుచేసిన కళాకృతి, మైసూరు పేట(తలపాగా)ను బహుకరించారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న ఉచతి హామీ పథకాలపై ప్రధాని మోడీ చేసిన విమర్శలకు ప్రతి విమర్శలు చేసిన సిద్దరామయ్య మరుసటి రోజే ప్రధాని మోడీని కలుసుకోవడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News