Thursday, January 23, 2025

భూ కుంభకోణం: హైకోర్టును ఆశ్రయించిన సిఎం సిద్ధరామయ్య

- Advertisement -
- Advertisement -

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) భూ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. భూ కుంభకోణం కేసులో తనను విచారించేందుకు అనుమతి మంజూరు చేస్తూ గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు సిద్ధరామయ్య. ఈ కేసును సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కోర్టు విచారణ జరపనుంది. ముఖ్యమంత్రి తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఈ కేసును కోర్టులో వాదించనున్నారు.

మరోవైపు, రాజకీయ ప్రయోజనం కోసం గవర్నర్ కార్యాలయాన్ని ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తూ ప్రతిపక్ష బిజెపిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫైరయ్యారు. సిఎం సిద్ధరామయ్యపై విచారణను ఖండిస్తూ.. ఇది అప్రజాస్వామికమని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News