Friday, February 28, 2025

అమిత్ షా తప్పుదారి పట్టిస్తున్నారు: సిద్ధరామయ్య

- Advertisement -
- Advertisement -

‘డీలిమిటేషన్’ కారణంగా దక్షిణాది రాష్ట్రాల సీట్లు ఏమీ తగ్గబోవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన హామీని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా ఖండించారు. అది నమ్మదగిన హామీ కాదని, తప్పుదోవ పట్టించే హామీ అని వ్యాఖ్యానించారు. అమిత్ షా వాదనలో కచ్చితత్వ సమాచారం లేదని, అది మరింత ఆందోళన కలిగించేదిగా ఉందని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే దక్షిణాది రాష్ట్రాలైన కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అమిత్ షా బుధవారం కొయంబత్తూర్‌లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ‘దక్షిణాది ప్రజల ప్రయోజనాలు ప్రధాని దృష్టిలో పెట్టుకున్నారని నేను పునరుద్ఘాటించదలచుకున్నాను. దక్షిణాది రాష్ట్రాల ఒక్క సీటు కూడా తగ్గబోదు.

ఒకవేళ సీట్ల పెంపు అంటూ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు వాటి వాటా దక్కుతుంది. అనుమానించేందుకు ఏమీ లేదు’ అన్నారు. అయితే జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు ఉంటుందా, లేదా అన్నది ఆయన మర్మంగానే ఉంచారు. ఇదివరలో డీలిమిటేషన్ ప్రక్రియలో 1971 జనాభా గణనను ఉపయోగించారు. అప్పట్లో దక్షిణాది రాష్ట్రాలు సాధించిన అభివృద్ధి గుర్తించడానికి ఉపయోగించారు. అసలు డీలిమిటేషన్ ప్రక్రియకు ప్రాతిపదిక ఏమిటని సిద్ధరామయ్య ప్రశ్నించారు. కేంద్రం యథాతథ స్థితినే కొనసాగించాలని (రాష్ట్రాల జనాభా ప్రాతిపదిక కాకుండా) పిలుపునిచ్చారు. ఇదిలావుండగా 2021 లేదా 2031 జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ స్థానాల మార్పుల అంచనా ఎలా ఉంటుందన్న దానిపై ఓ ప్రకటనను కర్నాటక ముఖ్యమంత్రి కార్యాలయం పంపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News