Sunday, December 22, 2024

కర్ణాటక ప్రభుత్వ ప్రకటనలో నెహ్రూకు చోటివ్వ లేదు: సిద్దరామయ్య ధ్వజం

- Advertisement -
- Advertisement -

Siddaramaiah Slams Karnataka Govt for no place to Nehru in Ads

బెంగళూరు/న్యూఢిల్లీ: స్వాతంత్య్ర పోరాట యోధులకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వ పత్రికా అడ్వర్‌టైజ్‌మెంట్‌లో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను చేర్చకపోవడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. బిజెపి చర్య దయనీయంగా వ్యాఖ్యానించింది. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని ఆర్‌ఎస్‌ఎస్ బానిసగా పేర్కొనగా, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి రణదీప్ సుర్జేవాలా దేశ మొదటి ప్రధాని నెహ్రూ అత్యున్నత స్థాయిపై బిజెపి ద్వేషం చూపిస్తోందని ఆరోపించారు. సిఎం బొమ్మై తన పదవిని కాపాడుకోడానికి నెహ్రూను చిన్నబుచ్చినప్పటికీ, అందులోంచి నెహ్రూ బయటపడతారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

బొమ్మై చేసిన పని నెహ్రూ అభిమానులైన తన తండ్రి ఎస్‌ఆర్ బొమ్మైని, తనతండ్రి రాజకీయ గురువు ఎం.ఎన్.రాయ్‌ను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. బ్రిటిష్ వారితోనే బానిసత్వం పోయిందని మనం అనుకుంటున్నా, ఇది తప్పని తానింకా ఆర్‌ఎస్‌ఎస్‌కు బానిననేనని బొమ్మై నిరూపించారని సుర్జేవాలా వ్యాఖ్యానించారు. కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రను వక్రీకరిస్తోందని విమర్శించారు. నెహ్రూను ప్రకటనలో చేర్చడం అవమానంగా భావిస్తున్నారా? అని సిఎంను ప్రశ్నించారు.

Siddaramaiah Slams Karnataka Govt for no place to Nehru in Ads

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News